Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ఐడెంటిటీ సెక్యూరిటీలో గ్లోబల్ లీడర్ సైబర్ఆర్క్ (నాస్డాక్ : సివైబిఆర్) హైదరాబాద్‌లో అత్యాధునికమైన నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రే షన్, అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమలు అండ్ వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించిన అనంతరం మాట్లా డుతూ ''నేను ఎక్కడికెళ్లినా పెద్దపెద్ద అమెరికన్ కంపెనీలు తమ సెంట ర్ను యూఎస్ఎ వెలుపల హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడం గురించి మాట్లాడుతుంటాను. ఇక్కడ తొలిసారిగా మన దగ్గరికి ఇజ్రా యెల్ కంపెనీ వచ్చింది. ఇజ్రాయెల్ వెలుపల హైదరాబాద్‌లో ఒక పెద్ద సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ గదిలో ఉన్న మనమందరమూ టెక్నా లజీ, కమ్యూనికేషన్‌పై అధికంగా ఆధారపడుతున్నాం. ఇక్కడ డివైజ్‌లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాయి'' అని తెలిపారు.