Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఇంధన, గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరను అధికంగా పెంచుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేదల బతుకులతో ఆటలాడుకుంటుందని బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు గుండ్రాతి శారదా గౌడ్ ఆరోపించారు. బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంధన, గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ గురు వారం సంక్షేమ సంఘం మహిళా నాయకులు గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శారదా గౌడ్ మాట్లాడుతూ. మోడీ హయాంలో ప్రతి వస్తువు ధర పెరగడంతో ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్యాస్ సబ్సిడీ ఎత్తివేయడంతో కేంద్ర ప్రభుత్వం ఇంకెవరికి సహాయం చేస్తున్నట్లు అని ఆమె ప్రశ్నించారు. గ్యాస్ తో పాటు ప్రతి వస్తువు ధరలు రికార్డు స్థాయిలో పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని విమ ర్శించారు. ఇలాంటి బీజేపీ ప్రభుత్వం తమకు అవసరం లేదని మహిళలు ముక్త కంఠంతో మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. కార్పొరేట్ గద్దలైన అదానీ, అంబానీలకు కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల రుణమాఫీలు చేస్తుం దని, కానీ పేద ప్రజలకు అధిక ధరల వడ్డింపులు చేస్తుం దని విమర్శించారు. పెంచిన వంట, వాణిజ్య, గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం ఖాయమని ఆమె హెచ్చరించారు.