Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచిన వంట, వాణిజ్య గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
- సీపీఐ జాతీయ, రాష్ట్ర నేతల డిమాండ్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ప్రధాని మోడీ ప్రభుత్వం కొంత మంది కార్పొ రేట్లకు అనుచిత ప్రయోజనాలు కల్పించేందుకు దేశ సామాన్య ప్రజలపై మోయలేని భారాలను వేస్తూ వివక్ష పూరిత విధానాలు అనుసరిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇంధన, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను అధికంగా పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను పట్టపగలు దోచుకుం టుందన్నారు. వంట, వాణిజ్య గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వ ర్యంలో గురువారం హిమాయత్ నగర్ లోని ఏఐటీ యూసీ రాష్ట్ర కార్యాలయం నుంచి హిమాయత్ నగర్ 'వై' జంక్షన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్. బోస్, ఈటి.నరసింహ, ఎన్.బాలమల్లేష్, ఏం.నరసిం హ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్.ఛాయాదేవిలతో పాటు వందలాది మంది సీపీఐ శ్రేణులు ఎర్ర జండా లు, ప్లకార్డులు చేతబూని ఈ ప్రదర్శనలో పాల్గొని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదా లు చేస్తూ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి.స్టాలిన్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, శ్రామిక మహిళా ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ పి.ప్రేమ్ పావని, హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు నేర్లకంటి శ్రీకాంత్, పడాల నళిని, నేతలు విజయలక్ష్మి పండిట్, శక్రిభాయి, అమీనా, మహమూద్, షహనా అంజుమ్, ఏం.అనిల్ కుమార్, ఆరుట్ల రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.