Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రను కొనసాగింపుగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్ర ద్వారా ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ పి.విజయారెడ్డి జూబ్లీహిల్స్ డివిజన్లోని ఫిలిం నగర్లో జ్ఞానీ జైల్ సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.