Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
లాబ్స్, పబ్లిక్ సెక్టార్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, క్యాజువల్ డైలీ వెజ్, ఆరునెలల ఒప్పంద కార్మికుల సమస్య లను పరిష్కరించాలని ల్యాబ్ క్లస్టర్ కమిటీ కన్వీనర్ ఎస్. కిషన్, పి.మురళి డిమాండ్ చేశారు. ల్యాబ్ క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో ఆరునెలల ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సంతకాల సేకరణ చేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి గ్యాస్, పెట్రోల్ రవాణా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా యన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కాంటాక్ట్ కార్మికుల జీతాలు మాత్రం పెరగడం లేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే ప్రజలపై భారాల మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులుగా శ్రమ దోపిడీ గురవుతూనే రిటైర్డ్ అయిన తర్వాత కనీస సౌకర్యాలు యాజమాన్యాలు వారికి కల్పించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు గ్రాడ్యుటీ అమలు చేయాలని కోరారు. బీడీఎల్‌లో పని చేస్తున్న ఆరు నెలల ఒప్పంద కార్మికులను తొలగించకుండా నియమించ బడ్డ కార్మికులనే యధావిధిగా కొనసాగించాలన్నారు. సమ స్యల పరిష్కారానికి ఈ నెల 6వ తేదీన జరిగే లేబర్ ఆఫీస్ ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.