Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ప్రమాదకరంగా మారిన వీధి కుక్కల బెడదపై గాంధీనగర్ డివిజన్ ఆంధ్రా విద్యాలయ స్కూల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ వేటనరీ డిపార్ట్మెంట్ డాక్టర్ సద్గుణ దేవి, డా'' భూక్యా నాయక్, జిహెచ్ఎంసీ సుధాకర్ రావు హాజర య్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కుక్కలు ఉన్న చోటు నుంచి దూరంగా నడవాలన్నారు. అకస్మాత్తుగా కర వడానికి కుక్క వేస్తే ఒకే చోట కదలకుండా స్థిరంగా నిలబ డాలనీ, కుక్క వాసన చూసి వెళ్లి పోతుందనీ, పిల్లలతో వున్న తల్లి కుక్కలను రాళ్లతో కొట్టడం లాంటి పనులు అస్స లు చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర యువ నాయకులు ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు రత్న సాయి చంద్, అధికారులు మధు, ఉస్మాన్, ఆంధ్రా విద్యాలయ స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్లు, స్కూల్ సిబ్బంది, బీజేపీ నాయకులు ఆకుల సురేందర్, సత్తి రెడ్డి, నవీన్ కుమార్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.