Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థుల కు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. గురువారం అప్టల్గంజ్లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో చిక్కడపల్లి షైనీ ఇండియా అకాడమీ నిర్వాహకులచే వారితె టీఎస్పీఎస్సీ గ్రూప్-పోటీ పరీక్షల సిలబస్, 20 పేజీల నోట్స్ పుస్తకాలను పోటీ పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ముఖ్య గ్రంథ పాలకులు ఏ వి ఎన్ రాజు చేతుల మీదుగా ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా షైన్ ఇండియా అకాడమీ కో-ఆర్డినేటర్ సురేష్ మాట్లాడుతూ బీద విద్యార్థిని, విద్యా ర్థులకు తమ ఇన్స్టిట్యూట్లో ఫీజులో 50శాతం రాయితీ కల్పించినట్లు చెప్పారు. ఈ రాయితీని పొందాలనుకునే విద్యార్థులు రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో చదువుచున్న పాఠకునిగా ముఖ్య గ్రంథపాలకులు చే సర్టిప ˜ికెట్ తీసుకు రావాలని సూచించారు. పోటీ పరిక్షాలకు సంబందించిన ప్రశ్నాపత్రాలు రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం నోటిస్ బోర్డుపై ఎప్పటి కప్పుడు సమాచారాన్ని తెలియజే స్తామన్నారు. విద్యార్థులకు ఉచితంగా ఆ పరీక్షలకు అవసర మ్యే పుస్తకాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ముఖ్య గ్రంథాలకులు ఎ.వి. యన్.రాజు, గెజిటెడ్ గ్రంథపాలకురాలు పి.జి.వి.రాణి, గ్రంథాలయ సిబ్బంది, సయ్యద్ అజీజ్ అహ్మద్, శ్రీకాంత్, రజాక్, ఉమా మహేశ్వర్ రెడ్డి, ప్రతాప్, రమ్య విక్రమ్, భాస్కర్ విద్యార్థిని, విద్యార్థులు పాఠకులు పాల్గొన్నారు.