Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
శ్రీ అవంతి సిల్క్స్ లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బషీర్ బాగ్‌లో శ్రీ అవంతి సిల్క్స్ లో ముందుగానే మహిళా దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ నెల 8వ తేదీన ఉమెన్స్ డే సందర్భంగా ఈ నెల 4, 5వ తేదీల్లో రెండు రోజుల పాటు మహిళల కోసం అన్ని సారీస్ పై 50శాతం ఆఫర్‌తో అందిస్తున్నమని నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహకులు నేహా మిశ్రా, విజరు శర్మ మాట్లాడుతూ మహిళల కోసం తాము చాలా ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నాం అన్నారు. గుజరాత్‌కు చెందిన చాలా రకాల వెరైటీ సారీస్ బుందేజ్, మధుబని, కలంకారితో బుండేజ్, కంచి బుందేజ్, పోచంపల్లి బుందేజ్, రాజ్‌కోట్ పటోలా, బాటిక్ ప్రింట్‌తో బుండేజ్. ఒకే చీరపై వివిధ రాష్ట్రాల కళలను మిళితం చేసి వివిధ రకాల చేనేత సారీస్ ఉన్నాయన్నారు. అంతేకాకుండా చేనేత కార్మికులు, క్రాఫ్ట్మ్యాన్లకు ఉపాధి కల్పించడం తమ నినాదం అని తెలిపారు. మహిళా దినోత్సవం రోజున విభిన్న కళలతో చేసిన చేనేత సారీస్ని తాము అందిస్తున్నాం అని తెలిపారు.