Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
వంట గ్యాస్ విపరీతంగా పెంచు తూ మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలను బతకనివ్వకుండా చేస్తోం దని తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ మన్నె క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ పిలుపుమేరకు గురువారం ఉదయం తాడ్‌బండ్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రస్తుతం 12:00లకు గ్యాస్ ధర పెంచి వినియోగదారులను ఇబ్బంది పాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రానురాజాల్లో మోడీ ప్రభుత్వానికి చర్మ గీతి పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ నిరసనలో మోని, రఘు, శ్రీను, ఫహీం, సాయి కిరణ్ మహిళలు యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కంటోన్మెంట్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ఓల్డ్ బోయిన్పల్ల్లి డివిజన్లో పెంచిన గ్యాస్ ధరకు నిరసనగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్ల్ల్లి చౌరస్తాలో ధర్మా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్ర మంలో మహిళలు ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని మహిళలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కర్ర లావణ్య మాక్కల నర్సింగ్‌రావు, సీనియర్ నాయకులు కర్రే జంగయ్య, వార్డు మెంబర్ గడ్డం నర్సింగ్‌రావు, నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్ ఎజాజ్ బారు, డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, జీఎస్ హరినాథ్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బుర్రి యాదగిరి, మార్కెట్ వైస్ చైర్మెన్ ఉదరు యాదవ్, ఖదీర్ బారు, మహిళా ప్రెసిడెంట్ లలితమ్మ, పెద్ద సంఖ్యలో మహిళా నాయకురాళ్ళు, సీనియర్ కార్యకర్తల పాల
కాప్రా : కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి పేదల నడ్డి విరుస్తోందని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకం గా ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ పరిధిలోని శ్రీ షిర్డీ సాయినగర్‌లో స్థానిక మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సిలిండర్లపై మోడీ బొమ్మ పెట్టీ, మోడీ దిష్టిబొమ్మ దహనం చేస్తూ, కట్టెలపై వంట చేస్తూ పెంచిన ధరల భారం తాము మోయలేమంటూ డౌన్ డౌన్ మోదీ.. అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఒకేసారి డొమెస్టిక్ సిలిండర్‌పై 50 రూపాయలు.. కమర్షియల్ సిలిండర్‌పై 350 రూపాయలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2014లో 410 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు మోదీ హయాంలో 1155 రూపాయలకు చేరిందంటే.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం తేటతెల్లమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మహిళా దినోత్సవ సందర్భంగా మోడీ ఇచ్చే బహుమానం గ్యాస్ ధర పెంచడం
దేశానికి సిగ్గుచేటు
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో ఈసీఎల్ కమలా నగర్ చౌరస్తాలో గ్యాస్ సిలిండర్ కట్టెల పొయ్యితో నిరసన కార్యక్రమం చేయ డం జరిగింది.మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎం.వినోద మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం సామాన్యులపై మహిళలపై మళ్లీ పెనుబారం మోపింది మోడీ ప్రభుత్వం దేశంలోదాపరమైన తర్వాత ఎన్నోసార్లు గ్యాస్ ధర పెంచడం జరిగింది ఇప్పుడు ఏకంగా నిన్నటికి నిన్న 50 రూపాయలు పెంచేసిండు పెంచాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ప్రజలు నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కొనలేని తినలేని పరిస్థితులలో కొట్టి పెట్టు లాడుతున్నారు ప్రజలకు తగ్గించేది పోయి పెంచుకుంటూ పోతావు మోడీ తిని తినక మహిళలు ఇప్పటికే రక్తహీనతతో చాలా బాధపడుతున్నారు గ్యాస్ ధర ఇలా పెరుగుతుంటే మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఐద్వా డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎ.శారద సి.హెచ్.లీలావతి కే.శోభ, సుశీల, మాధవి, లక్ష్మి గౌస్య జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని నాగారం, దమ్మాయిగూడా మున్సిపాలిటీలల్లో బీఆర్ఎస్ నేతలు ధర్నాలు నిర్వహించారు. నాగారం లో ధర్నా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి , మున్సిపల్ బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్ ,వైస్ చైర్మన్ ,కౌన్సిలర్లు ,బీఆర్ ఎస్ నేతలు పాల్గొన్నారు.
దమ్మాయిగూడా ధర్నాలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ వసూపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ ,మున్సిపల్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కౌకుంట్ల తిరుపతి రెడ్డి , కౌన్సిలర్లు ,బిఆర్ ఎస్ నేతలు పాల్గొన్నారు.