Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ కలెక్టర్ ఎదుట ధర్నా చేసిన అంగన్వాడి కార్మికులు
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలని సీిఐటీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి చంద్రశేఖర్‌లు అన్నారు. గురువారం మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేని ఎడల పెద్ద ఎత్తున్న ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారన్నారు. మహిళలు బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే ఎక్కువమంది ఉన్నారని పేర్కొన్నారు. గత 40సం.లకు పైగా ఐసీడీఎస్‌లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలం దిస్తున్నారని తెలియజేశారు. కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలేవి ప్రభుత్వం నేటికీ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన పక్కనే ఉన్న తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చారని. పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తు న్నారు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించడం లేదు. స్వయం గా ముఖ్యమంత్రే అంగన్వాడీ వర్కర్ పేరును టీచర్స్‌గా మార్చారు. కానీ టీచర్లతో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు. టీచర్లతో సమానంగా వేతనం తదితర సౌకర్యాలు కల్పించాలని, ప్రగతి భవన్ సమావేశంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీిఐటీయూ జిల్లా నాయకులు ఉన్ని కృష్ణన్ లింగస్వామి కిష్టప్ప గణేష్ వెంకన్న అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు సునీత కార్యదర్శి శోభారాణి శివరాణి బాలమణి తదితరులు పాల్గొన్నారు.