Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కేంద్ర ప్రభుత్వ పాలన పేద, మధ్య తరగతి కుటుంబాలకు గుదిబండగ మారిందని, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని ప్రభుత్వ శాసనమండలి విప్, మేడ్చల్ జిల్లా టీిఆర్‌ఎస్ అధ్యక్షుడు శంభిపూర్ రాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరల పెంపుపై నిరసిస్తూ ధర్నా చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు గురువారం. గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ శాసనమండలి విప్, మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజుతో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ప్రజాప్రతినిధులు, నియోజికవర్గ ప్రజాప్రతినిధులతో బీఆర్ఎస్ నాయకుడు బొంగునూరి ప్రభాకర్ రెడ్డి దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని గండి మైసమ్మ చౌరస్తా వద్ద భారీ సంఖ్యలో మహిళలతో కలిసి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ధర్నా భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, జీహెచ్ఎంసి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, నియోజికవర్గ ప్రజాప్రతినిధులు, ఎన్ఎంసి ఆయా డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు, అనుబంధ కమిటీల సభ్యులు, యువ నాయకులు మహిళ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట : అధిక ధరలను నియంత్రించడంలో మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైందని కుత్బుల్లాపూర్ మండలం సీపీిఐ కార్యదర్శి ఈ ఉమా మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో షాపూర్‌నగర్, జగద్గిరిగుట్ట, గిరినగర్ ప్రాంతాలలో ఆందోళన చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఖాళీ సిలిండర్‌ను తలపై ఎత్తుకొని మోసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు హరినాథ్‌రావు, మండల సహాయ కార్యదర్శి రాము, సీపీఐ నాయకులు ప్రవీణ్, రాములు, అశోక్ రెడ్డి, శ్రీనివాస్, భీమేశ్, మహేందర్, నర్సింహారెడ్డి, చంద్రకాంత్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి నగర్ డివిజన్గిరి నగర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు నర్సయ్య, శ్రీనివాస్, యాకుబ్, ఏఐటీయూసీ నాయకులు మల్లారెడ్డి, హరీష్ రెడ్డి, వీరన్న, శేఖర్, ఇబ్రహీంలు పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ : కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా గ్యాస్ ధరలను పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం మోపుతుందని బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు అన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ గురువారం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నెంబర్ వన్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద స్థానికులు, కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎనిమిదేళ్ళ క్రితం రూ.410లు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1255 లకు చేరుకుందన్నారు. మహిళలను మళ్ళీ కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకొనే రోజులు తీసుకొస్తున్న ఘనత బీజేపీికే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబూరావు, డివిజన్ అధ్యక్షులు సీిహెచ్ ప్రభాకర్ గౌడ్, డివిజన్ కార్యదర్శి వెంకటేష్ చౌదరి, సీనియర్ నాయకులు పవన్, రవీందర్ రెడ్డి, సురేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, జేస్వంత్, అనిల్, ముత్యపాగ శ్రీనివాస్, సంతోష్, శారద తదితరులు పాల్గొన్నారు.
కూకట్పల్లి : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాలతో, మూసాపేట్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ మూసాపేట్ చౌరస్తాలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ప్రతి సారి ఎన్నికలు అయిన వెంటనే గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడం కేంద్రంలోని మోడీ సర్కారుకు ఆనవాయితీగా మారిందని, మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్‌కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సి.హెచ్ సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, నాగుల సత్యం, కర్క రవీందర్, తుకారాం, విష్ణు, రాజు నర్సింహ, రాజ్ కుమార్, రవి సింగ్, రాము, చెరుకు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ : కేంద్ర ప్రభుత్వం మరోసారి సిలిండర్ ధరలను పెంచి పేదల నడ్డి విరుస్తోందని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ మండిపడ్డారు. గురువారం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఖాళీ సిలిండర్లతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ ఒకేసారి డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50 లు, కమర్షియల్ సిలిండర్‌పై రూ.350లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన మిత్రుడు గౌతమ్ అదానీ నష్టపోయిన కోట్లాది డాలర్ల అవినీతి సొమ్మును మోదీ సామాన్య ప్రజల నుంచి గ్యాస్ ధరలు పెంచి రికవరీ చేస్తాడని, సామాన్య, పేద ప్రజలను దోచి, రక్తం పిండి, ధనికులకు పెట్టే దొంగలు కేంద్రంలోని బీజేపీ నేతలని అన్నారు. బీజేపీ సర్కార్ కు ఎన్నికల వేళ కామన్ మ్యాన్, ఎన్నికల అనంతరం కార్పోరేట్ మ్యాన్ గుర్తుకు వస్తాడన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయో లేదో, గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచారని కార్పొరేటర్ విమర్శించారు. నానాటికీ పెంచుతున్న సిలిండర్ ధర వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. గత 2014లో రూ.410లు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు మోడీ హయాంలో రూ.1155లకు చేరిందంటే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం తేటతెల్లమవుతుందన్నారు.