Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- గ్యాస్ ధరలను తగ్గించాలని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిరసన
నవతెలంగాణ-బేగంపేట్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పతనమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గల అల్ఫా హౌటల్ ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మంత్రి పాల్గొని కట్టెల పొయ్యి పై వంట చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక్క వంట గ్యాస్ ధరలను పెంచడం వలన అన్ని రకాల వస్తువులపై ధరల ప్రభావం పడుతుందని, పేద, మద్య తరగతి ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్యాస్ సిలెండర్ ధర రూ. 410 ఉంటే సిలెండర్‌కు దండం పెట్టి నిరసన తెలిపిన నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 8 సంవత్సరాల కాలంలో 745 రూపాయలు పెంచి గ్యాస్ ధర ను రూ. 1155 చేసి ప్రజల పై పెనుభారం మోపారని ధ్వజమెత్తారు. పెంచిన ధరలను తగ్గించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లలో ధర్నా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న బీజేపీకి అధికారంలో ఉండే అర్హత లేదని, ప్రజలు కూడా విసిగివేసారి పోయారని, రానున్న ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, బీఆర్ఎస్ డివిజన్ అద్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, జయరాజ్, నరసింహ ముదిరాజ్, అమర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిరసన
కంటోన్మెంట్ : ధరలను అదుపు చేయడంలో విఫలమైన మోడీ వెంటనే గద్దె దిగాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లు లాస్య, నందిత, నివదితల అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంబానీ, అదానీలకు దోచి పెట్టేందుకే కేంద్రం గ్యాస్ ధరలు పెంచిందని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజే పీ నేతలు కలలు కంటున్నారని.. 2024 లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పతనం ఖాయమన్నారు. కంటోన్మెంట్ లోని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆర్మీ హాస్పిటల్ లో అనుమతిం చలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ చొరవతో మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరయిందని చెప్పారు. కార్యక్రమంలో వైద్య మౌలి క సదుపాయాల సంస్థ చైర్మెన్ ఎర్రోళ్ల శీను, తెలంగాణ బేవ రేజ్ కార్పొరేషన్ చైర్మెన్ గజ్జల నగేష్, మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యులు పాండు యాదవ లోకనాథం, నలిని, ప్రభాకర్ సీనియర్ నాయకులు తేజ, శ్రీనివాస్, సరిత తదిత రులు పాల్గొన్నారు మహిళలు ప్ల కార్డులను చేతమూని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా వంటలు చేసి నిరసన తెలిపారు.