Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్‌నగర్
రాత్రి బయటకు వెళ్లిన ఓ యువకుడు ఉదయమే శవమై కనిపించాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీ సులు, స్థానికులు తెలిపిన కథ నం ప్రకారం... యాప్రాల్ కౌకూ ర్ లోని భరత్ నగర్లో సైఫ్ అలీఖాన్ కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. శామీర్‌పేటలోని ఓ ప్రయివేటు కంపెనీలో కాపాలదారునిగా పనిచేస్తు జీవనం సాగించే వాడు. 2022 ఆగస్టు ప్రేమ వివాహం చేసుకుని అదే కాలనీలో అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. గత నెల రోజుల నుంచి భార్య భర్తల మధ్య తగాదాలు రావడంతో వేరుగా ఉంటున్నాడు. గురువారం రాత్రి 8గంటలకు సైఫ్ తన తండ్రి వద్ద రూ. 20 తీసుకుని బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఉదయం భరత్ నగర్లో విగత జీవిగా కనిపించాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం గాంధీ దవాఖానాకు తరలించారు. గతంలోనే హత్య కేసులో సైఫ్ అలీఖాన్ ముద్దాయిగా ఉన్నాడు. గురువారం రాత్రి మద్యం సేవిస్తుండగా స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణలోనే చనిపోయాడా, వేరే ఇతర కారణాలతో చనిపో యాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ జానకి, ఏసీపీ వెంకట్ రెడ్డి ఎస్ హెచ్ ఓ. సీతారాం, ఎస్ఓటీ సీఐ రాములు, ఎస్సైలు మోహన్, సాయిలు, అనిల్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.