Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్వీ నగర్లో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఏఈ స్రవంతితో కలిసి శుక్రవారం పర్యటించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎస్వీ నగర్లో నెలకొన్న ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించినట్టు తెలిపారు. భూగర్భ డ్రయినేజీ, సీసీ రోడ్లను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కార్పొరేటర్, అధికారి దష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై ప్రతిపాదనలు పంపించి వెంటనే పరిష్కార దిశగా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నెమలి రవి, నాయకులు పైళ్ల ప్రవీణ్, రవీందర్ సాగర్, సానాల రవి, దొడ్డి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.