Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- నేరేడ్మెట్
కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రాజు అన్నారు. శుక్రవారం నేరేడ్ మెట్లోని మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ... నేత్ర సమస్యలు ఉన్న 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు తప్పని సరిగా ఈ శిబిరానికి వచ్చి పరీక్ష చేయించుకోవాలన్నారు. సోమవారం కూడా కళాశాల ఆవరణలో క్యాంపు కొనసాగుతుందని తెలిపారు. జాతీయ సేవా విభాగం అధికారి డాక్టర్ ఎస్. రమేష్, జి. మల్లిక ఆధ్వర్యంలో నిర్వహించారు. 150 మంది విద్యార్థిని, విద్యార్థులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరికి అవసరమైన కంటి అద్దాలు, మందులను ఉచితంగా పంపిణీ చేశారు. డాక్టర్ లగిశెట్టి రూప, వారి సాంకేతిక సిబ్బంది, నర్సింగ్, డాక్టర్ ఏ.చంద్రయ్య, డాక్టర్ ఎ.రచన, డాక్టర్ జగన్ ,స్వప్న, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.