Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగారం మున్సిపల్ చైర్మెన్ చంద్రారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కుక్కలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం నాగారం పురపాలక సంఘ కార్యాలయంలో కుక్క కాటుకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పోస్టర్ ను కమిషనర్ వాణి రెడ్డితో కలిసి ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో కుక్కల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కుక్క కాటుకు గురవుతు న్నారన్నారు. దీనిపట్ల ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ''కుక్క కాటుకు గురికాకుండా ఉండేం దుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు'' పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ బండారి మల్లేష్ యాదవ్ , కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, స్థానిక నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.