Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.వెంకటేష్ డిమాండ్ చేశారు. ఇటీవల గహ వినియోగదారుల గ్యాస్ సిలిండర్‌పై 50 రూపాయలు పెంచడానికి నిరసనగా శుక్రవారం సాయంత్రం హరి నగర్ రిసాలగడ్డలో శ్రామిక మహిళ సమన్వయ కమిటీ(సీఐటీయూ) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లు పెట్టి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీిఐటీయూ నగర కార్యదర్శి ఎం.వెంకటేష్, శ్రామిక మహిళ సమన్వయ కమిటీ నగర కన్వీనర్ ఆర్.వాణి మాట్లాడుతూ గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజానీకంపై తీవ్రమైన భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు వేతనాలు పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తున్నదని అన్నారు.బీజేపీ ప్రభుత్వం ఇకనైనా తన ప్రజావ్యతిరేక విధానాలను ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు కె. అజరుబాబు, సహాయ కార్యదర్శి టి.మహేందర్, నగర కమిటీ సభ్యులు పుల్లారావు, బస్తీ ప్రజలు వి.సువర్ణ, జి.నిర్మల, టి.యాదమ్మ, జి.చంద్రకళ, టి.రేణుక పాల్గొన్నారు.