Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-కంటోన్మెంట్
బీఆర్ఎస్ మద్దతుతో కంటోన్మెంట్ బోర్డు ఏడో వార్డు నుంచి తాను ఈసారి ఎన్నికల బరిలో ఉంటున్నట్టు జాగృతి ఏడో వార్డు అధ్యక్షురాలు. మహిళ నాయకురాలు ఎన్ సరిత చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి గెలిపించగలరని కోరారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి ఎంతో సేవ చేశాన ని, జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జాగతి సభ్యురాలుగా చేరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న ఆశీస్సులతో ఏడో వార్డులో వివిధ బస్తీలలో ఉన్న సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కారం చేసే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేశానని తెలిపారు. ఎమ్మెల్యే సాయన్న అడుగుజాడల్లో నడుస్తూ, ఏడో వార్డు నుంచి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిస్తానని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌లు తనను గుర్తించి ఏడో వార్డు అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరారు. తామంతా ఎమ్మెల్యే సాయన్న మనషులమని, ఎమ్మెల్యే తమ మధ్యలో లేకపోవడం చాలా బాధాకర మన్నారు. ఏడో వాడు నుంచి టికెట్ తనకే దక్కుతుందని, పార్టీ టికెట్ ఇవ్వకపోయినా తాను బరిలో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గణ లింగం, ఎన్. నీరజ్, సీనర్ల, సుధాకర్, శివకుమార్, సందీప్, సుబ్రహ్మణ్యం, విజయ్, సోనీ, తదితరులు పాల్గొన్నారు.