Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
నవతెలంగాణ-నాచారం
ఉప్పల్ నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. నాచారం హెచ్ఎంటి నగర్ కమ్యూనిటీ హాల్లో అదనపు కంటి వెలుగు కేంద్రాన్ని జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌తో కలిసి శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివద్ధి, సంక్షేమాన్ని ప్రజలందరికీ అందించేందుకు సీఎం కేసీఆర్ విజన్‌తో ముందుకు వెళ్తున్నాడని అన్నారు. అందులో భాగంగానే ప్రజలందరికీ సం పూర్ణ కంటి వెలుగులు అందించాలనే లక్ష్యంతో కంటి వెలు గు కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటికే ఎర్రకుంట ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కంటి కేంద్రం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం నాచారం డివిజన్లో హెచ్ ఎంటి నగర్ కమ్యూనిటీ హాల్లో అదనంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగుల కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కరరావు, ప్రతినిధులు కోటే శ్వరరావు, జనార్దన్‌రావు, కిరణ్, యాదగిరి రెడ్డి, నరసింహ, బీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, పార్టీ డివిజన్ అధ్య క్షులు మేకల ముత్యంరెడ్డి, కట్ట బుచ్చి గౌడ్, సుగుణాకర్, రామకృష్ణ, మధుకర్ రెడ్డి, చంద్రశేఖర్, జంపన్న, ఉప్పల్ పీహెచ్సీ సూపర్వైజర్ ప్రకాష్ బోగా, కంటి వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.