Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
నవతెలంగాణ-మల్కాజ్గిరి
సామాన్యునికి గుదిబండగా మారిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతారావు డిమాండ్ చేశారు. పెంచిన వంటగ్యాస్ ధరలకు నిరసనగా శుక్రవారం మల్కాజ్గిరి చౌరస్తాలో బీఆర్ఎస్ ఆద్వర్యంలో కట్టెల పొయ్యి పెట్టి వంటావార్పు నిర్వహించి తమ నిరసనను తెలియచేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుండి వంటగ్యాస్‌పై, నిత్యావసర వస్తువులపై అధిక ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారన్నదన్నారు. ఇప్పటికైనా పెరిగిన ధరలను నియంత్రించి ప్రేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కార్పోరేటర్లు సునీత రాము యాదవ్, వై. ప్రేమ్‌కుమార్, మీనా ఉపేం దర్‌రెడ్డి,సబితా కిషోర్, మాజీ కరాఓ్పరేటర్ జగదీష్ గౌడ్. మల్కాజ్గిరి సర్కిల్ అధ్యక్షులు పిట్ల శ్రీనివాస్,జిఎన్‌వి సతీష్‌కుమార్, రాము యాదవ్, ఉపేందర్‌రెడ్డి, ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
నేరేడ్మెట్ : మల్కాజ్‌గిరిలో ధర్నాకు నేరేడ్ మెట్ కార్పొరేటర్ కొత్త పల్లి మీనా ఉపేందర్ రెడ్డి పార్టీ నాయకు లతో కలిసి తరలి వెళ్లారు.