Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రెండో వార్డు రసూల్పూరాలో అధికారులు తొలగించిన 35000 పేద ప్రజల ఓట్లను తిరిగి నమోదు చేసేందుకు గాను బాధితుల తరఫున మైనింగ్ కార్పొరేషన్ చైర్మెన్ క్రిశాంక్ కోర్టును ఆశ్రయించనున్నారు తొలగించిన రసూల్‌పూర మురికివాడలకు 35 వేల ఓట్లు నమోదు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై క్రిశాంక్ కోర్టుకు వెళ్ళనున్నారు శుక్రవారం రాత్రి బాధితులతో కలిసి ఒక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఓట్లు కోల్పోయిన బాధితులు మోర పెట్టుకోవడంతో కోర్టుకు వెళ్లడమే కాకుండా ఈనెల 10వ తేదీన కంటోన్మెంట్ బోర్డు ముట్టడి కార్యక్రమం కూడా చేస్తున్న చేయనున్నట్టు ఆయన పిలుపునిచ్చారు ఓట్లు పోయిన వారందరవి తిరిగి చేర్చే వరకు ఉద్యమాన్ని చేపట్టాలని కృశాంక్ బాధితులకు చెప్పారు 35 వేల ఓట్లు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వార్డు 2లో బాధితులు కంటోన్మెంట్ బోర్డుకు వ్యతిరేకంగా ఓ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ సంఘం ద్వారానే కోర్టుకు వెళుతున్నారని తెలుస్తోంది. ఆ బాధితులకు క్రిశాంక్ మద్దతుగా ఉండి కోర్టులో రిట్టు వెయ్యనున్నారు తొలగించిన ఓట్లను తిరిగి చేర్చకపోతే ఎన్నికలు జరగనీయకుండా చేస్తామని బాధితులు హెచ్చరించారు.