Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడ్ మెట్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తే రూ 500 రూపాయ లకే గ్యాస్ సిలిండర్ అంద చేస్తామని ఆ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరకు వ్యతిరేకంగా శుక్రవారం కౌకూర్ లో రోడ్డుమీద బైఠా యించి నిరసన తెలిపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ప్రజలపై భారాలు మోపుతున్న బిజెపి , స్టేట్ ట్యాక్స్ పేరిట...దోచుకుంటున్న తెలంగాణ ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని పిలుపు నిచ్చారు. చంద్రశేఖర్, జీడి శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, సి ఎల్ యాదగిరి, నిమ్మ అశోక్ రెడ్డి, గుత్తి రామచందర్, డోలి రమేష్, కృష్ణ గౌడ్, 133 డివిజన్ ప్రెసిడెంట్ పవన్, సూర్య ప్రకాష్ రెడ్డి, సత్యనారాయణ, సతీష్ యాదవ్, పాండు, సాయికుమార్, మార్షల్, మహిళా నాయకురాలు వీనస్ మేరీ, పద్మ, విజయ, భాగ్యమ్మ, నిర్మల, సుహాసిని పాల్గొన్నారు.