Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఓల్డ్ బోయిన పల్లిలో శుక్రవారం కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు అధ్యక్షతన బీఆర్ఎస్ బూత్ స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు పాటు ఎమ్మెల్సీ.. నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో కూకట్పల్లి నియోజ కవర్గంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకి అందించడంలో ముందు న్నామని తెలిపారు. ఇప్పటికే నియోజక వర్గంలో 15 వేల మందికి కల్యాణ లక్ష్మి, షాది ముబరాక్, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు 10 వేల మందికి సహాయం అందించామని చెప్పారు. అంతేకాకుండా దాదాపు 40 వేల మందిక ఆసరా ద్వారా పింఛన్లు కూడా అందజేస్తున్నారని తెలిపారు. ప్రతీ కార్యకర్త చిత్త శుద్ధతో పని చేయాలని.. మరింత అభివృద్ధి చేసుకుందాం అని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలు వెన్ను విరుస్తోందని.. అంతే కాకుం డా కేసీఆర్ అందించే పింఛన్లు సగం మేమే అంది స్తున్నా మని నిసిగ్గుగా చెప్పడం.. వారి అబద్దాలకు నిదర్శన మన్నారు. రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్, కర్ర జంగయ్య, కర్ర లావణ్ ఇజాజ్, ఇబ్బు, బుర్రి యాదగిరి పాల్గొన్నారు.