Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కడ చూసినా గుంతలమయమే..
- రూ. 43కోట్ల నిధులు,358 తీర్మానాలు పనుల పెండింగ్....
- కార్పోరేటర్ వెంకటేష్ యాదవ్ ఆగ్రహం
నవతెలంగాణ-బోడుప్పల్: కార్పొరేషన్ లో పుష్కలంగా నిధులున్నా మౌలిక సదుపాయాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని కార్పోరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్లో అభివృద్ధి కుంటుపడిందని వెంటనే మరమ్మత్తులు చేయాలని కోరుతూ మున్సిపల్ కమీషనర్ కు కార్పొరేటర్ ఆద్వర్యంలో డీఈ శ్రీ లతను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లాలలోనే శరవేగంగా అభివృద్ధి చెందుత ున్న కార్పొరేషన్ గా పేరొందిన బోడుప్పల్ లో స్థిరమైన అధికార యంత్రంగం లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. కార్పొరేషన్ లో తాత్కాలిక కమీషనర్ ,అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లు దారు ణంగా తయారయ్యాయి. వాహనదారులు ప్రాణాలు గుప్పేట్లో పెట్టుకొని బయటకు వెళ్తున్నారు.
రోడ్ల మరమ్మతులు లేక, కొత్త రోడ్లు వేయక వాహనదారులు పడరాని పాట్లు పడుతు న్నారు.గతంలోనే గుంతలు ఉండటం వర్షాలకు ప్రధాన రహదారులు చిల్లుల బొంతలా తయార య్యాయి. పరిస్థితి దారుణంగా ఉన్నా అధికారులు స్పందించడం లేదు. తాత్కాతిక మరమ్మతులపైనా దృష్టి సారించలేకపోతున్నారు. చిన్నపాటి జల్లులు కురిసిన గుంతల్లో నీరు చేరి కనపించకపోవడంతో వాహనదారులు వాటిలో పడి గాయాలై ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ మార్గాలలో నిత్యం ఆర్టీసీ బస్సులు, బారీ వాహనాలు,ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రధాన రహదారిలో పలు హాస్పిటల్ లు,విద్యాసంస్థలు, షాపింగ్ మాల్ ఉండటంతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డు కావడంతో కనీసం నడవలేని దుస్థితి. పాలకమండలి ఏర్పడి మూడు సంవత్సరాలైన రూ. 43కోట్ల నిధులు,358 తీర్మానాలు చేసి వాటిని చూపిస్తున్నారే... కానీ పనులు మాత్రం జరగడం లేదు. రోడ్లుపై గతంలో ఎన్నో వినతిపత్రాలు ఇచ్చిన బుట్టదా ఖాలైనాయి. గత కొంతకాలం కమిషనర్ అభివృద్ధిని పట్టించుకోలేదు.ఇద్దరూ డీఈలు కార్యాలయం నిండా అధికారులు ఉన్న తాత్కాలిక మరమ్మత్తుల పేరుతో తూతూ మంత్రంగా కొద్దిపాటి రోడ్డు ప్యాచ్ వర్క్ చేసి చేతులు దులుపుకున్నారు.వీటికి తక్షణం మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.బోడుప్పల్ కమాన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు గల ప్రధాన మార్గం 100ఫీట్ల రోడ్డుతో మూడు కిలోమీటర్ల మేర ఉండి నిత్యం వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు సంస్థల వాహనాలు,పాఠశాల వాహనాలు వెళ్ళడంతో అధికంగా రద్దీ ఉంటుంది. అయితే ఈ రోడ్డు నిత్యం గుంతలమయంగా మారడంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు హాస్పిటల్ లు, విద్యాసంస్థలు, షాపింగ్ మాల్ ఉండటంతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డు కావడంతో పాదచారులు కనీసం నడవలేని దుస్థితి ఏర్పడింది.బోడుప్పల్ అంబేద్కర్ సర్కిల్ నుండి చిలుక నగర్ వెళ్ళే మార్గం 60 పీట్ల రోడ్డుతో రెండు కిలోమీటర్ల మేర ఉన్న కూడా నాలుగు ఫంక్షన్ హలు,రెండు మద్యం దుకాణాలు ఉండడంతో సాయంత్రం సమయంలో ఉద్యోగ స్తులు, విద్యార్థులు పని ముగించుకొని ఇండ్లకు చేరే సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎస్ ఎస్ ఎస్ గార్డెన్ వద్ద, బోమ్మక్ శాంతమ్మ గార్డెన్ వద్ద,హేమనగర్ వద్ద ఏర్పడ గుంతలో వాహానదారులకు ప్రమాదం జరుగుతున్నాయి. రోడ్లు బాగాలేక ట్రాఫిక్‌తో వాహనదారులు ఇబ్బందిపడు తున్నారు.
వీరారెడ్డి నగర్ చౌరస్తా నుండి మల్లాపుర్ వెళ్ళే దారి రెండు వైపుల 60 ఫీట్ల రోడ్డులో వారంతాపు సంతలు, కమర్షియల్ వ్యాపార సంస్థల నిర్వహణ ఉండడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానికి తోడు ఈ దారిలో రోడ్డు అనేక చోట్లా గుంతలమయంగా మారడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. బోడుప్పల్ బంగా రు మైసమ్మ ఆలయం నుండి చెంగిచెర్ల వెళ్ళే మార్గంలో ఇక్కడ బార్ వలన స్థానిక కాలనీ వాసులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా రోడ్డు వెడల్పు లేకపోవడం, ఉన్న రోడ్డు సౌకర్యంగా లేక పోవడం, వేగ నియంత్రణ పాటించకపోవాడంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకుం టున్నాయి.చెంగిచెర్ల చౌరస్తా నుండి చెర్లపల్లి మార్గం రొడ్డు వెడల్పు పనులు నిరంతరాయంగా జరిగుతుండడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికైనా వెంటనే పనులు చేయాలని లేని పక్షంలో ధర్నాకు సిద్దమని తెలిపారు.ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు పోతుల మల్లేష్ యాదవ్, పడతం లోకేష్,డివిజన్ అధ్యక్షుడు సుడి కృష్ణా రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.