Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ప్రధాని మోడీ ప్రభుత్వం కొంతమంది కార్పొరేట్లకు అనుచిత ప్రయోజనాలు కల్పించేందుకు దేశ సామాన్య ప్రజలపై మోయలేని భారాలను వేస్తూ వివక్షాపూరిత విధానాలు అనుసరిస్తుందని సీపీఐ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జీ. దామోదర్ రెడ్డి ఆరోపించారు. ఇంధన, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని నిరసిస్తూ సీపీఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో హెచ్బీ కాలనీలో నిరసన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజలు తమ జీవనోపాధి కోసం పోరాడుతున్న సమయంలో వంట, వాణిజ్య గ్యాస్ ధరలను పెంచడం ఆందోళన కలిగించే విషయం అన్నారు. గ్యాస్ సబ్సిడీ కూడా ఎత్తివేడంతో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సహాయం చేస్తున్నట్టు కనిపించడం లేదన్నారు. సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. శంకర్ రావు, కె.ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు టి. సత్య ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ ఉప్పల్ మండల అధ్యక్షుడు అజీమ్, సీపీఐ హెచ్బీ కాలనీ కార్యవర్గ సభ్యులు జాన్, కుమార్, కొండయ్య, రమణ, దస్తమ్మ, జ్యోతి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.