Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలోనీ లక్ష్మీనగర్ కాలనీ సంక్షేమ సంఘ భవనంలో తాగునీరు, డ్రయినేజీ, ఇతర స్థానిక సమస్యల నిమిత్తం కాలనీ సంక్షేమ సంఘ కార్యవర్గం, కాలనీవాసులతోకార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ శుక్రవారం సమావేశమయ్యారు.సమావేశంలో లేవనెత్తిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ సంబంధిత శాఖలకు సమన్వయం చేస్తూ ముందు ముందు కూడా తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్రవంతి, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, కాలనీ అధ్యక్షులు రామ్మోహన్ రావు, ఉపాధ్యక్షులు కష్ణమోహన్, ప్రధాన కార్యదర్శి కోటిరెడ్డి, కోశాధికారి జి. రాంరెడ్డి, సంయుక్త కార్యదర్శులు బీఎస్ఆర్ మూర్తి, ప్రచార కార్యదర్శి బి. శ్రీనివాస్ రెడ్డి, యాదవ రెడ్డి, కార్యవర్గసభ్యులు, స్థానిక నాయకులు కామేశ్వర రావు, రాజేశ్వర రావు, సుబ్బారెడ్డి, వెంకట్ రెడ్డి, దండెం నరేందర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.