Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
బదిలీలు పదోన్నతుల షెడ్యూలు ప్రకారం తప్పకుండా జరుగుతాయని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఆ సంఘం హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతి రెడ్డి అధ్వర్యంలో శనివారం సైదాబాద్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ప్రచారం నిర్వహించి.. పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ చెప్పింది చేయడం పీఆర్టీయూ టీఎస్ సంఘం నైజ అని, సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వాన్ని ఒప్పించడంతో పాటు ఈ షెడ్యూల్లోనే పండిత పీఈటీల ఉన్నతీకరణ సైతం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి నూతన హెల్త్ స్కీమూ వర్తింపజేసేలా విధివిధానాలను ఖరారు చేస్తారని, ఉపాధ్యాయుల సమస్య లను పీఆర్టీయూ టీఎస్‌కు వదిలేయమని అన్ని సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందు ఉంటామన్నారు. తమకు మరింత బలాన్ని చేకూర్చాలని గుర్రం చెన్నకేశవరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించాలని కోరారు. శ్రీపాల్ రెడ్డి ఇచ్చిన వివరణ సంతృప్తి చెందిన ఉపాధ్యాయ సోదర సోదరీమణులు పీఆర్టీయూ టీఎస్ వెంట ఉంటా మని తమ సమస్యల పరిష్కారం సాధించగల నేత గుర్రం చెన్నకేశవరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో దిగ్విజయంగా గెలిచేలాగా ముందుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మందడి వెంకట్ రెడ్డి, లక్ష్మీనారాయణ వి.ప్రశాంత్ రెడ్డి, సాంబశివరావు, సురేష్ కుమార్ దాసు, కె. వెంకటరెడ్డి, శ్రీనివాస్, వి.అశోక్, శ్రీనివాస్ రెడ్డి, నరసరాజు, రాజు, రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.