Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధులు ఉన్న అభివృద్ధి సున్నా
- అభివృద్ధి చెయ్యలేని అసమర్ధ పాలకులు ఎందుకు?
- మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఉప్పల్
రామంతపూర్ డివిజన్లో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారయ్యాయని రామంతపూర్ మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ అన్నారు. గత హయాంలో మంజూరైన నిధులను ఇప్పటివరకు పనులు ప్రారంభించడం నిరసిస్తూ శనివారం మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొడుతూ వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రామంతపూర్ రాజేంద్రనగర్లో ఎస్సీ సబ్ ప్లాన్లో భాగంగా 87 లక్షల రూపాయలతో కమిటీ హాల్ నిర్మించి అందులో బస్తి దావఖన ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరారు.
నిధులు మంజూరైన అసమర్థ పాలకుల అలసత్వం వల్ల టెంకాయ కొట్టడం వరకే పరిమితం అయ్యారు. పదవీ కాలం చేపట్టి రెండు సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు కమిటీ హాల్ నిర్మాణం పూర్తి కాక పోవడము విడ్డూరంగా ఉంది అన్నారు. కాంగ్రెస్ నాయకులు హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో రామాంతపూర్ని అభివృద్ది చేసింది మేమే అని గొప్పలు చెప్పుకుంటూ జనాలకు నవ్వులు తెప్పిస్తున్నారని, వారు గతంలో కమిటీ హల్ నిర్మాణం చేపట్టి శిలాఫలకాలపైనా వారి పేరు పెట్టుకోవటం తప్ప, డ్రైనేజి గురించి కానీ, మంచినీటి పైపు లైన్ గురించి పట్టించుకోలేదని వాపోయారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మధుసూధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొప్పు నర్సింగ్ రావు, తుట్ నరసింహ,చంబు సాయి, ప్రశాంత్,అలె రమేష్,ముత్యాల మధు,సాగర్,బొసాని పవన్,చాంద్ పాషా,అనంద్,మల్లేష్,వెంకటేష్ పాల్గోన్నారు.