Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీ బ్యూరో
నాగోల్లోని అజయ్ నగర్ కాలనీలో శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందని కృష్ణవేణి స్కూల్ ప్రిన్సిపాల్ కె ప్రేమానంద చారి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణవేణి స్కూల్ ప్రెసిడెంట్ పి . జైపాల్ రెడ్డి గారు మరియు అకాడమిక్ మేనేజర్ బాలాజీ గారు ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించి విద్యార్థులు ప్రదర్శించిన ఆహార పదార్థాలను తిలకించారని తెలిపారు
పి.జయపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు ఉద్దేశించి ఆహారపు అలవాట్లు మరియు మన సాంప్రదాయ ఆహార పదార్థాల విశిష్టతను వివరించారు సాంప్రదాయ ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రస్తుతం మారుతున్న ప్రపంచంలో వ్యక్తిగత పనుల్లో లీనమై సరైన ఆహారం తీసుకుంటలేరని. రెడీమేడ్ ఆహారం అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోలేక పోతున్నారని దీనివలన అనారోగ్యం గురి అవుతున్నారని తెలిపారు ఫుడ్ ఫెస్టివల్ లో విద్యార్థులు ప్రదర్శించిన ఆహార పదార్థాలను ప్రత్యేక విద్యార్థి దగ్గరికి వెళ్లి అభినందించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఉమాదేవి ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు