Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
పర్వతాపూర్లోని అరోరా టెక్నాలజికల్ అండ్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ కాలేజీలో స్టూడెంట్ ఆక్టివిటీ కమిటీ మరియు క్రీడా క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ,జాతీయస్థాయి స్పోర్ట్స్ మీట్ ఉత్కర్ష్ నీ ఘనంగా నిర్వహించారు, ఈ జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్లో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ మరియు క్యారమ్ పోటీలను నిర్వహించారు. పోటీలలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు నుంచి వచ్చిన విద్యార్థులను పాల్గొన్నారు, ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతులు, ప్రశంస పత్రాన్ని మరియు టోపీలు అందజేశారు , ఈ ముగింపు కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శ్రీకాంత్ జట్ల మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ డాక్టర్ అజరు కుమార్, ఫిజికల్ డైరెక్టర్ వేణుగోపాల్, అసిస్టెంట్ రిజిస్టర్ బాలకృష్ణారెడ్డి, వివిధ విభాగాధిపతులు, సాక్ కోఆర్డినేటర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, క్రీడా క్లబ్ విద్యార్థులు మరియు సాక్ విద్యార్థులు పాల్గొన్నారు.