Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ దడిగ శంకర్
నవతెలంగాణ-బడంగ్పేట్
నేటి సమాజంలో చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని కార్పొరేటర్ దడిగ శంకర్ అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గుర్రంగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వీధి కుక్కల నుండి రక్షణ కొరకు కార్పొరేటర్ దడిగ శంకర్, సానిటేషన్ ఇన్స్పెక్టర్ వి.యాదగిరితో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కుక్కలను రాళ్లతో, కట్టెలతో కొట్టకూడదని, స్కూల్ నుండి వచ్చేటప్పుడు, పోయేటప్పుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా కలిసి వెళ్లాలని, కుక్కలు మనల్ని వెంబడించినప్పుడు పరిగెత్తడం లాంటిది చేయకూడదన్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు షాప్ వెళ్లాల్సి వస్తే ఇంట్లోని పెద్దవారిని మాత్రమే వెళ్లమనాలని అదేవిధంగా కార్పొరేషన్ అధికారులను కుక్కలకు పట్టుకొని వెళ్లి వాటికి ఆంటీ రాబిస్ వ్యాక్సినేషన్, అంటీ బర్త్ కంట్రోల్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పారిశుద్ధ్య సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.
నాగోల్లో... నాగోల్ డివిజన్లో మన్సు రాబాద్లో గల ప్రభుత్వ పాఠశాల లోని విద్యార్థులకు శనివారం వీధి కుక్కలపై అప్రమత్తతో పాటు పలు అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో నాగోల్ డివిజన్ కార్పొ రేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బందీలో ఉన్న కుక్కల వద్దకు వెళ్ళవద్దని, ఒక వేళ దాడి జరిగితే నిశ్చలంగా నిలబడి చేతులు శరీరానికి దగ్గరగా ఉంచుకోవాలని ఆమె తెలిపారు. కుక్కలు వేసవిలో ఆగ్రహంతో ఉంటాయని, దీంతో దాడి చేసే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. కుక్క అరుస్తూ మీ దగ్గరికి వచ్చినప్పుడు వేగంగా నడవడం మానుకొని ఎప్పటికీ వెనకకు తిరిగకూడదని, పరిగెత్తకూడదని పేర్కొన్నారు. కుక్క దాడి జరిగినప్పుడు బంతిలా ముడుచుకొని ముఖం మరియు తల వెనుక వైపు చేతులు కప్పడం ద్వారా తీవ్రమైన గాయాల నుండి తప్పించుకోవచ్చని అన్నారు. కుక్క కాటుకు గురైనట్లయితే గాయాన్ని పది నిమిషాల పాటు ప్రవహించే నీటిలో ఒత్తిడిని ఉపయోగించి కడగాలి వెంటనే వైద్య సహాయం తీసుకొని యాంటీ రేబిస్ వాక్సినేషన్ వేయించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సంతోష్ నగర్లో : సైదాబాద్ డివిజన్ పరిధిలోని సంకేశ్వరం బజార్ ప్రభుత్వ పాఠశాల డివిజన్ కార్పొరేటర్ కొత్తకా పూర్ అరుణ రవీందర్ రెడ్డి, డిసీ జయంత్, వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్, డాక్టర్ రామచంద్ర రెడ్డి, పాఠశాల హెడ్మాస్టర్ రేణుక, ఉపాధ్యాయులు విద్యార్థి సిబ్బంది ఆధ్వర్యంలో బస్తీలలో ర్యాలీ నిర్వహిస్తూ, వీధికుక్కల జాగ్ర త్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కుక్కకాటు నుంచి ఎలా రక్షించుకోవాలో విద్యార్థులకు వివరించారు. కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం వేయవద్దని తెలిపారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. వీధి కుక్కల విషయంలో జీహెచ్ఎంసీ నిబంధనలు అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక నాయకులు సిబ్బంది పార్టీ శ్రేణులు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.