Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-ఉప్పల్
ఆలయాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సత్యపతి రాథోడ్ అన్నారు. శనివారం ఎన్జీఆర్ఐ జీఈ క్యాపిటల్ వద్ద గల అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయాలలో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత మరియు దేవాలయ పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హోలికెలి, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికా రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, చైర్మెన్ లక్ష్మీనారాయణ, కొక్కొండ జగన్, బింగి శ్రీనివాస్, కొల్లురి శ్యామ్, ఈవో భాగ్యలక్ష్మి, శ్రీకాంత్, పూజారులు రవి తదితరులు పాల్గొన్నారు.