Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
నాగోల్ డివిజన్లోని పతుల్లగూడలో గల జంతువుల సంరక్షణ కేంద్రాన్ని శనివారం జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి సందర్శించి అక్కడి పనితీరును పరిశీలించారు. గ్రేటర్ పరిధిలోని కుక్కల దాడుల సంఘటనల నేపథ్యంలో ఆయన నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ నాథ్ యాదవులతో కలిసి జంతువుల సంరక్షణ కేంద్రంలోని వెటర్నరి శాఖ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీధి కుక్కలకు పిల్లల నియంత్రణ ఆపరేషన్ చేసే గదులను పరిశీలించి రోజుకు ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయని వాటి విధి విధానాలను అడగగా దానికి అనిమల్ ఫర్ పీపుల్స్ ప్రైవేట్ సంస్థ మరియు జిహెచ్ఎంసి వెటర్నరీ శాఖ పర్యవేక్షణలో ఆపరేషన్లు, సంరక్షణ ప్రక్రియ కొనసాగు తుందని అక్కడ సిబ్బంది తెలిపారు. అదేవిధంగా అందు బాటులో ఉన్న చనిపోయిన జంతువులకు సంబంధించి క్రిమియేషన్ కేంద్రం పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ సర్కిల్ వెటర్నరీ డాక్టర్ యాదగిరి యు సి డి బలరాం బిజెపి నాయకులు సురేందర్ నాథ్ యాదవ్, శ్రీధర్ గౌడ్ లతోపాటు పాల్గొన్నారు.