Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
ప్రజల్లో మూత్రపిండాల వ్యాధులపైన, మూత్రపిండా ల ఆరోగ్యం పైన అవగాహన పెంపొందించడానికి ప్రతి ఏడాదీ మార్చిలో రెండో గురువారాన్ని ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ సందర్బంగా హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిడ్నీ దానం చేసిన 50 మందికి పైగా కిడ్నీ దాతలను సత్కరించుకోవడం సంతోషంగా ఉందని యశోద హాస్పిటల్స్, సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి అన్నా రు. ఈ సందర్భంగా ప్రముఖ నెఫ్రాలజిస్ట్, పద్మభూషణ్ డాక్టర్.ఎం.కె.మణి మాట్లాడుతూ దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ విపరీతం గా పెరిగిపోవడం ఆందోళనకరం అన్నారు. మన దేశ జనాభాలో 17శాతం మంది ప్రజలు మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ప్రతి ఏడాదీ కొత్తగా 5 లక్షల మంది డయాలసిస్ దశకు చేరుకుంటున్నారన్నారు. మనకు కిడ్నీలు అనే ఓ వ్యవస్థ ఉందనీ, అవి ఆరోగ్యంగా ఉంటేనే మనం బాగుంటామనీ, గుండె, కాలేయంతోపాటు కిడ్నీలు కూడా సమానంగా పని చేస్తాయని గ్రహించకపోవడమే ఇందుకు కారణమని డాక్టర్.ఎం.కె.మణి అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏకైక మార్గం ప్రజలకు కిడ్నీ వ్యాధులపై అవగహన కల్పించడం, కిడ్నీ వ్యాధులను నివారించడానికి కిడ్నీ సంభదిత అధిక ప్రమాదం ఉన్న వ్యక్తుల్లో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ టెస్ట్లు చేయించు కోవడం ఉత్తమమనీ, ప్రముఖ నెఫ్రాలజిస్ట్, పద్మభూషణ్ డాక్టర్. ఎం.కె.మణి తెలిపారు. కేర్ ఫర్ యువర్ కిడ్నీ ఫౌండేషన్ వ్యవస్థాపక ధర్మకర్త, జాకబ్ వర్గీస్, ప్రముఖ నెఫ్రాలజిస్ట్, పద్మభూషణ్ డాక్టర్.ఎం.కె.మణి, డాక్టర్. రాజశేఖర చక్రవర్తి, డాక్టర్.పవన్ గోరుకంటి ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి కిడ్నీ దానం చేసిన కిడ్నీ దాతలను వారి కుటుం బాలను సత్క రించారు.