Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ-నాచారం
నిరుపేదలకు అండ న్యూ లైఫ్ ఫౌండేషన్ అని వ్యవస్థాపకురాలు నసీమా బాను అన్నారు. నిరుపేద లకు, నిరాశ్రాయులకు అండగా నిలుస్తున్నట్టు చెప్పారు. 2022 నుంచి ఆడపిల్లల పెండ్లిళ్లకు ఆర్థిక సహాయం, అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నిరుపేదలకు అండగా ఆదుకుంటునందుకు హర్షం వ్యక్తం చేశారు. నాచారంలోని నిరుపేద కుటుంబానికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా అందరి న్యూస్ యూట్యూబ్ ఛానెల్ ఫౌండర్, స్థానిక రిపోర్టర్ వేర్పుల మహేష్ పాల్గొని నిరుపే దలకి ఉచితంగా నిత్యావసర సరుకులు అందజ ేశారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ న్యూ లైఫ్ ఫౌండేషన్ ద్వారా నసీమా భాను మాథర్ దేరిస్సా సేవా భావాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో అభాగ్యులకు అండగా నిలుస్తుందన్నా రు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు చూపిన సేవా మార్గంను కొనసాగిస్తూ.తన సొంత డబ్బులతో అందరికి అండగా నిలుస్తున్న నసీమా బానుకు అండగా నిలిచి, తనకు తోచిన సహాయం ఎల్లప్పుడూ చేస్తామని మహేష్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.