Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వాలంటీర్లు, ఒక ఆయమ్మ జీతాలను బీఎల్ఆర్ ట్రస్ట్ చైర్మెన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి అందజేశారు. ప్రభుత్వ పాఠశాల్లో పని చేస్తున్న వాలంటీర్లు, ఆయమ్మకు 3 నెలలుగా వేతనాల్లేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుసుకున్న బండారి లక్ష్మారెడ్డి శనివారం పాఠశాలకు వెళ్లి రూ.78 వేలు నగదు వేతనంగా అందజేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి వారి సమస్యలను పరిష్కరించడంలో బీఎల్ఆర్ ట్రస్టు చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారు. పేద విద్యార్థులకు చదువులకు చేయూత, ప్రమాద బారిన పడిన వారికి ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు ఉచిత ఉద్యోగ శిక్షణ, నమ్ముకున్న కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసానిస్తూ బీఎల్ఆర్ ట్రస్ట్ ఎందరో అభాగ్యులకు ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల వాలంటీర్లు, ఆయమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు బీఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, బీఎల్ఆర్ ట్రస్ట్ ప్రతినిధి కటార్ల భాస్కర్, యాదిరెడ్డి, సంతు యాదవ్, కాల్వల అంజి, లంబు శ్రీను, శశి, సాబీర్ అలీ, శ్రావణ్, వాసుదేవ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.