Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం మల్లాపూర్ వెంక టరమణ కాలనీలోని శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ విజ్ఞాన భారతి హైస్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ప్రతిభ నైపుణ్యతను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెడితే అద్భుతాలు సాధించవచ్చు అన్నారు. పాఠశాల స్థాయిలో పిల్లలకు విస్తతంగా విద్య వైజ్ఞానిక ప్రదర్శనలను ఏర్పాటు చేసి వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసినప్పుడే సంపూర్ణ విద్యార్థిగా సమాజానికి ఉపయోగపడతా డని చెప్పారు. ప్రాథమిక దశ నుంచే ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిబను గుర్తించి ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు. సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ నమూనాలను తిలకించి అభినం దించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఆర్ ట్రస్టు ప్రతినిధి కటార్ల భాస్కర్, మహేష్ గౌడ్, పాఠశాల కరస్పాండెంట్ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.