Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సరూర్నగర్
మహిళా దినోత్సవం నాడు కాకుండా ప్రతిరోజు మహిళలని గౌరవించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కే పురం డివిజన్ కిన్నెర గ్రాండ్ హౌటల్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగ్ ప్రధమ మహిళ ఉప్పల స్వప్న గుప్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా దినోత్సవ సంబరాల కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో మహిళలది ప్రముఖ పాత్ర అన్నారు. ఆడవాళ్లను గౌరవించడం కుటుంబం నుండే మొదలు కావాలన్నారు.సమాన విద్య అవకాశాలు కల్పిస్తే మహిళలు అని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ, జిహెచ్ఎంసి కార్మికులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మహేశ్వరము నియోజకవర్గ బిఅర్ఎస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, స్వప్న రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.