Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్బి
కూకట్పల్లి నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ముందున్నామని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కేపీహెచ్బి, అల్లాపూర్‌లో జరిగిన బూత్ స్థాయి కమిటీ సమావేశం లో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ లు మందడి శ్రీనివాసరావు, సభియ గౌసుద్దిన్లు పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లా పూర్ డివిజన్ ఒకప్పుడు ఎలా ఉంది ఇపుడు ఎలా ఉందో కళ్ళ ముందు కనపడుతుందన్నారు. మంచి నీళ్ళు, రోడ్లు , విద్యుత్ సదుపాయాలు లేక ప్రజలు అల్లాడి పోయేవారని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. అల్లాపూర్ అభివృద్ధికి మారు పేరుగా ఉంది అని అన్నారు. అలాగే కేపీహెచ్‌బీ డివిజన్లో ప్రజలకు అందించే మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా వేల కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం, ప్రత్యేక మహిళా పార్కులు, ఓపెన్ జిమ్‌లు, దేవాలయాలు, ఇండోర్ స్టేడియంలు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ కోఆర్డినేటర్ సతీష్ అరోరా, డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఐలయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.