Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దేవిశ్రీ గురూజీ
నవతెలంగాణ- కూకట్పల్లి
సంప్రదాయ ఆహార పద్ధతుల వైపు నగరవాసులు మొగ్గు చూపుతుం డటం ఆనందంగా ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దేవిశ్రీ గురూజీ అన్నారు. ఆదివారం నగరంలోని వెంకట్రావ్నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనాకు ముందు చాలా మంది ఆహారం విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకునేవారు కాదని, కానీ ప్రస్తుతం ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఏది పడితే అది తినడం లేదని ఎన్నో రకాలుగా దాన్ని విచారణ చేసి తీసుకుంటున్నారని అన్నారు. పూర్వకాలంలో కంచు పాత్రలు, మట్టి పాత్రల్లో వంట చేసేవారని క్రమక్రమంగా నగరవాసులు ఆ విధానానికి కూడా అలవాటు పడుతున్నారని ఇది మంచి పరిణామమని అన్నారు. నగరవాసులకు కంచు పాత్రల్లో భోజనం పెట్టాలనే ఆలోచన రావడం అభినందనీయమని నిర్వాహకులను ఆయన అభినందించారు. నిర్వాహకులు గాండ్ల రమేష్ కుమార్ మాట్లాడుతూ... దేశంలో ఇప్పటి వరకు ఒక్క కేరళ రాష్ట్రంలో మాత్రమే కంచు పాత్రల్లో కొన్ని చోట్ల వంటలు చేస్తున్నారని కానీ తమ సంస్థ తొలిసారిగా తెలంగాణలో కంచు పాత్రల్లో వండే విధానానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. త్వరలోనే నగర వ్యాప్తంగా మరిన్ని శాఖలు విస్తరించి ఈ విధానాన్ని అందరికీ పరిచయం చేస్తామని అన్నారు. తొలుత 500మందికి వంట చేసే వీలుగా తమిళనాడు నుంచి ప్రత్యేక కంచు పాత్రలను తయారు చేయించామని అతి త్వరలోనే 5 వేల మందికి వండేలా మరిన్ని పాత్రలను తెప్పిస్తామని అన్నారు. సాధారణ పాత్రల్లో వంట చేస్తే 20 శాతం కేలరీలు మాత్రమే ఉంటాయని కంచు పాత్రల్లో వంట చేయడం వల్ల 90 శాతానికి పైగా కేలరీలు ఉంటాయని శాస్త్రీయంగా నిరూపితమైందని తెలిపారు.