Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫతేనగర్ మాదిగ సంక్షేమ సంఘం చైర్మెన్ సతీష్ రానా
నవతెలంగాణ - బాలానగర్
బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాదిగ సంక్షేమ సంఘం చైర్మన్ సతీష్ రానా అన్నారు. మాదిగ సంక్షేమ సంఘం ఫతేనగర్ బృందం ఆధ్వర్యంలో ఆదివారం మాన్యశ్రీ కాన్సీరాం సోదరి స్వర్ణకౌర్ కాన్సిరాం ఫౌండేషన్ చైర్మన్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమెను కలిసి అనేక విషయాల గూర్చి చర్చించారు. ముఖ్యంగా భారతదేశంలో అత్యంత వెనుక బడినటువంటి బహుజనుల అభివృద్ధి కొరకు దేశవ్యాప్తంగా వృషి చేయాలని మహానుభావులు కాన్సీరాం ఐడియాలజీని అమలు చేసి దేశ ప్రగతికి తోడ్పడాలని కోరారు. రాబోయే రోజుల్లో బహుజనుల రాజ్యాధికారం కోసం అహర్నిశలు కృషిచేసి, ఓటును అమ్ముకోకుండా మన ఓటు మనమే వేసుకునే విధంగా కృషి చేయాలన్నారు. దేశంలో వెనుకబడిన తరగతుల ప్రజలు బాగుపడాలంటే ఉచిత విద్య, వైద్యం అందించాలని పాలక ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని,
అత్యంత ఓటు శాతం ఉన్న బడుగు బలహీన వర్గాల వారి ఓటును వేయించుకుని ఉన్నత వర్గాల్లో ఉన్న బడాబాబులు ఈ దేశాన్ని పాలించడం వల్ల బహుజనులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈ దేశ ప్రగతి దిశగా అడుగులు వేయాలంటే బహుజనుల రాజ్యాధికారం తప్పనిసరి అన్నారు. అందుకు దేశం కోసం త్యాగం చేసిన మహానుభావుల అడుగుజాడల్లో వారి యొక్క ఆలోచనా విధానాన్ని అమలు చేయడంలో ప్రతి ఒక్క దళితబిడ్డ ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యాదగిరి, తాడేపల్లి హరిబాబు, చిటకోరు నరేష్, ఎల్లం, ప్రమోద్ మరియు మధు, జగన్ తదితరులు పాల్గొన్నారు.