Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
సమాజంలో స్త్రీ శక్తి ఎంతో గొప్పదని ,స్త్రీ లేనిదే సృష్టి లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీ లలితా పరమేశ్వరి దేవాలయ అధ్యక్షులు లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరిం చుకొని ఆదివారం రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పంచశీల కాలనీ లోగల రాజ్యలక్ష్మి ఇండిస్టీస్ కార్యాల యంలో ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు .ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేడు పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాలలో రాణిం చడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. మహిళలు స్వశక్తితో ఎదిగినప్పుడే సమాజంలో ఎంతో గౌరవ వ్యాధులు దక్కుతాయన్నారు. ప్రముఖ సామాజికవేత్తలు, సంఘ సేవకులు, డాక్టర్ రత్నప్రభ, బీసీ సంఘం రాష్ట్ర మహిళ నాయకురాలు మహియా రాజ్ యాదవ్ లు మాట్లాడుతూ విద్య ,ఉద్యోగ ,ఉపాధి ,అవకాశాల్లో తమదైన శైలిలో మహిళలు ముందుకు వస్తు ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ముందుకు సాగాలని సామాజిక సేవాభావాలు అలవర్చుకొని పేదవారికి తోచినంతలో సహాయం చేయాలని సూచిం చారు. తాము గత కొన్నేళ్లుగా పేద వారికి పలు విధాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నామని భవిష్యత్తులో కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామ న్నారు. ఆడది అబల కాదని సబల అని నిరూపించు కోవాలన్నారు. అనంతరం పలు రంగాలలో ప్రతిభ కరిచిన మహిళలకు ప్రగతి ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ ఆరిఫుద్దీన్ నేతృత్వంలో శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ ప్రతినిధి కొల్లూరి శ్రీదేవి, వివిధ రంగాల మహిళ ప్రతినిధులు నిర్మల, సుష్మ కుమారి, సారా షేక్ ,శాంతి వికలాంగుల సంఘం అధ్యక్షురాలు భ్రమరాంబిక, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు సమీర్, సంఘ సేవకులు ఎం వెంకటేశ్వర్ రెడ్డి,మహిళా కార్మికురాలు వెంకట లక్ష్మి, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.