Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిరీష సత్తుర్ ఏర్పాటు చేసిన పెడల్ ప్రైడ్ సైక్లింగ్ ఈవెంట్లో ప్రభుత్వ విప్ గాంధీ
నవతెలంగాణ - కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి వనం వద్ద రాబోయే మహిళ దినోత్సవం సందర్భంగా, అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తుర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెడల్ ప్రైడ్ మెగా సైక్లింగ్ ఈవెంట్‌ను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి, ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించిన సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ, మహిళ దినోత్సవం సందర్భంగా అవని స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తుర్ ఆధ్వర్యంలో నిర్వహించిన, పెడల్ ప్రైడ్ మెగా సైక్లింగ్ ఈవెంట్ ను నిర్వహించడం చాలా అభినదించదగ్గ విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
నిర్వాహకులు శిరీష సత్తుర్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని, సమాజ హితం కోరి ఎన్నో మంచి సేవ కార్యక్రమాలు చేపడుతున్నారని, నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో శారీరక శ్రమ ఎంతో అవసరం అని, ఈ సైక్లింగ్ ఈవెంట్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందనీ, వద్ధులు, యువత, చిన్న పిల్లలు పాల్గొనడం ఎంతో ఆనందదాయకం అని, ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించాలని, శారీరక శ్రమ వలన మానసిక ఉల్లాసం ,ప్రశాంతత చేకూరుతుందనీ, మారిన జీవన శైలిలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాయమం చేయాలని, ఈ సైక్లింగ్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనీ ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్ సత్తుర్, ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు కాశినాథ్ యాదవ్, పోశెట్టిగౌడ్, రాములుగౌడ్, షౌకత్ అలీ మున్నా, సత్యనారాయణ, అవని స్వచ్చంద సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.