Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ - దుండిగల్
పట్టుదలతో చదివితే విద్యార్థులు ప్రతిభావంతులు అవుతారని వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి తెలిపారు. ఆదివారం గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని సెయింట్ ఆంథోనీ పాఠశాల 23వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మల్లవారపు బాలలత ఐఏఎస్, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎం.లక్ష్మీ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థులను విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలన్నారు, ప్రతి రోజు తల్లిదండ్రులు వారితో కొంత సమయం గడిపి వారికి సమాజం యొక్క విలువలు, క్రమశిక్షణ, చదువు పట్ల అంకిత భావం పెంపొందించేల కృషి చేయాలన్నారు. అనంతరం బాలలత మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టం తో చదవాలని, పెద్దలను, తల్లిదండ్రులును గౌరవించాలని, సెల్ఫోన్లకు, టీవీలకు దూరంగా విద్యార్థులను ఉంచాలని కోరారు. సెయింట్ అంథోనీ విద్యాసంస్థలు చైర్మెన్ నరిశెట్టి సుందర రాజు మాట్లాడుతూ తమ పాటశాల 2000వ సం.లో ప్రారంభించామని నేటి వరకు సంస్థ ఎదుగుదలలో విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాద్యాయులు కషి మార్గదర్శనం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనేక మంది విద్యార్థులు వివిధ రంగాలలో స్థిరపడ్డారని తెలిపారు. వివిధ రంగాల్లో రాణించిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు జ్ఞాపికలను అందజేశారు.
విద్యార్థుల సంస్కృతి కార్యక్రమంలు అద్భుతంగా అతిధులును తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థుల కోలాహలంతో పాఠశాల ఆవరణం ఆనందంతో కోలాహలంగా మారింది. పాఠశాల డైరెక్టర్ సుందర రాజు శివాజీ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాఠశాల అకాడమీ డైరెక్టర్ నరిశెట్టి సరిత, ప్రిన్సిపాల్ షర్మిల క్రిస్టీ, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, వివిధ పాఠశాలల కరెస్పాండెంట్స్ పాల్గొన్నారు.