Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మీర్ పేట్
శ్రీశ్రీశ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బంజారా సేవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మిథుల నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని అందుకే తమ రాష్ట్రంలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎప్పుడూ మరవద్దని తెలిపారు. గిరిజనులకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన కేసీఆర్నుగుర్తు పెట్టుకోవాలని సూచిం చారు. అనంతరం బంజారా భవన నిర్మాణానికి శంకుస్థాపన మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, బంజారా సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.