Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
విదేశీ విద్యకు వెళ్లే ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీ/ఈ బీసీ/బ్రాహ్మణ విద్యార్థులకు చదువుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షల స్టైఫండ్ మంజూరు చేస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ సభ్యులు ఆర్. కష్ణయ్య తెలిపారు. ఆదివారం తాజ్ డక్కన్ హౌటల్లో సంస్థ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విదేశాలకు వెళ్లే బీసీలకు ఏటా 300 మందికి, మైనారిటీలకు 500 మందికి, బ్రాహ్మణ కులం విద్యార్థులకు 100మందికి ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు చొప్పున మంజూరు చేస్తున్నారని తెలిపారు. దాదాపు అన్ని కేటగిరీల విద్యార్థులలో ప్రతీ ఒక్కరికి స్టైఫండ్ వస్తుంది కానీ బీసీలు 2000 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 300 మందికి మాత్రమే వస్తున్నదన్నారు. సంఖ్య పెంచి అర్హులందరికీ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. విదేశీ విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికితెలుగు రాష్ట్రాల నుంచి 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 40 దేశాలలో విదేశీ విద్యకు సంబంధించిన సమాచారాన్ని నిర్వాహాకులు తెలిపారు. 180 యూనివర్సిటీలలో ఏయే కోర్సులు ఉన్నాయి... విద్యార్థులకు లభించే విద్యా, బోధన, కోర్స్ వివరాలు, హాస్టల్ వసతి, స్కాలర్షిప్, స్టైఫండ్ వివరాలు తెలిపారు. అలాగే కోర్స్ పూర్తిచేసి తర్వాత లభించే విద్యా, ఉద్యోగ అవకాశాల గురించి చెప్పారు. ప్రపంచ దేశాల నుండి విదేశీ ప్రతినిధులు పాలొ ్గన్నారు.అమెరికా, కెనడా, ఆస్టేలియా, ఇంగ్లాండ్, జర్మనీ, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా దేశాలలో వేల సంఖ్యలలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే లక్ష రూపాయల వేతనాలు ఇస్తునారని వీటిని ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని కోరారు. గుజ్జ కృష్ణ, రామ కృష్ణ, చైర్మెన్ రమేశ్ అరసవెల్లి, జీఎం శేఖర్, నిఖిల్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.