Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఈ నెల 12న లాలాపేట్ లో జరిగే సీపీఐ సికింద్రాబాద్ 3వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. వారసిగూడ చౌరస్తాలో ఆదివారం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రారంభమైన బైక్ ర్యాలీ వారసిగూడ చౌరస్తా, సీతాఫల్మండి, తార్నాక, లాలాపేట్, శాంతినగర్, తుకారం గేట్, మీదిగా తిరిగి అడ్డగుట్టలో ముగించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ. వచ్చేది అచ్చేదిన్ అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజలకు నిత్యావసరల ధరలు పెంచుతూ సామాన్య ప్రజలు బతుకులను మరింత భారం చేస్తున్నదన్నారు.సికింద్రాబాద్ నియోజకవర్గం సమస్యలకు కేరాఫ్‌గా మారిందని... నియోజక వర్గంలో తీవ్రమైన మంచినీటి సమస్య, డ్రయినేజీ సమస్య, విపరీతమైన దోమల బెడద ఉందని.. కనీస మౌలిక వసతులు లేక ఇక్కడి ప్రజలు నిత్యం అవస్థలు పడతున్నారని తెలిపారు. అనేక దఫాలుగా పోరా టాలు నిర్వహించినప్పటికీ పాలకులు స్పందించకుండా తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఇలాంటి తరుణంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో పార్టీని పునర్నిర్మానం చేసుకొని భవిష్యత్తులో ప్రజా సమస్యల పైన బలమైన పోరాటాలు నిర్మించడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయని తెలిపారు. మహాసభల జయప్రదానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిపిఐ సికింద్రాబాద్ కన్వీనర్ కాంపల్లి శ్రీనివాస్, ఎండి ఉమర్ఖాన్, తోకల సోమయ్య, పాకాల యాదగిరి, మహమ్మద్ యూసుఫ్, ఎస్ కె. లతీఫ్, గువ్వల మల్లేష్, చారి, ఎస్.కె కాజా, శంకరయ్య, ఖదీర్, రషీద్, లెనిన్, పద్మ, నారాయణ, యాదగిరి, అంజి, హనుమంతు, కళ్యాణ్, రామస్వామి, ఎల్లయ్య, జి,యాదగిరి, వినోద్, అంజలి పాల్గొన్నారు.