Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
రోజురోజుకు పెరుగుతున్న వంటగ్యాస్ ధరలు పేదలపై పెనుభారంగా మారుతున్నాయన్నాయని సి.పి.ఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం. హన్మేష్ అన్నారు. పెరిగిన వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ ఆదివారం విద్యానగర్లోని మార్క్స్ భవన్ ముందు గ్యాస్ సిలిండర్ లతో నిరసన తెలిపి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కార్పోరేట్ కంపెనీలు వేల కోట్లు ఎగవేవేస్తున్నా పట్టించుకోని ప్రభు త్వాలు, ఆ నష్టాలను భారాలను ప్రజలపై మోపుతున్నా యన్నారు. ఐఎఫ్టీయూ నగర అధ్యక్షురాలు పద్మ, ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వి.కిరణ్, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్, పీఓడబ్ల్యూ నగర కార్యదర్శి వరలక్ష్మి, దేవ మని, శ్యామల, పీడీఎస్యూ అధ్యక్ష, కార్యదర్శులు అనిల్, ప్రవీణ్, రాకేష్, కావ్య, తిరుపతి, శ్రీనివాస్, లత, భారతి, బాబాన్న, డి.వి.వి సత్యనారాయణ, సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో..
జూబ్లీహిల్స్ : పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గిం చాలని జూబ్లీహిల్స్ జోన్ రహమత్ నగర్ డివిజన్, ఎస్పిఆర్ హిల్స్ లో సీఐటీయూ జోన్ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వ ర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి సీఐటీయూ హైదరాబాద్ జిల్లా నగర నాయకురాలు కామ్రేడ్ వాణి హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పై పెంచిన ధరను వెంటనే తగ్గిం చాలని లేని యెడల పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళ సమన్వయ నాయకురాలు సమా ధానం, సువర్ణ, ఆదిలక్ష్మి, పార్వతమ్మ, బుజ్జమ్మ, స్వప్న, మాధ వి, తబిత ,శారద, లావణ్య ,జానకి, నాయకులు బి దేవదాస్, ఏ ఆర్ నరసింహ, బి బాలయ్య ,టీ భాగ్యరాజ్ ,రూపేష్ ,తదితరులు పాల్గొన్నారు.