Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని విజిలెన్స్ అధికారులు.
- ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది..?
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ చౌరస్తాలో గల టిఫిన్, టీ, సెంటర్లలో ఒక్కొక్క హౌటల్లో సుమారు 5 నుంచి 7 డొమెస్టిక్ సిలిండర్లను బహిరంగంగా పెట్టుకుని వాడుతున్నారని స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. కమర్షి యల్ సిలిండర్లు వాడకుండా ఇండ్లలో వాడే చిన్న సిలిండర్లు వాడుతున్న వ్యాపారస్తులు పై విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు టిఫిన్, టీ ,సెంటర్ల వాళ్లకు ఇన్ని చిన్న సిలిండర్లు ఎలా ఇస్తున్నారు, డీలర్లకు తెలియకుండా సిలిండర్లు రవాణా చేసే ఆటో డ్రైవర్లు, ఎక్కువ రేటు తీసుకొని బ్లాక్ దందా చేస్తున్నారా? లేక గ్యాస్ డీలర్ల అను మతితోనే ఈ బ్లాక్ దందా నడుస్తుందా? వచ్చిన లాభాలు విజిలెన్స్ అధికారులకు కూడా ఇస్తున్నారా అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒక ఇంటికి ఒక కనెక్షన్ మాత్రమే ఇస్తారు, సంవత్సరానికి 8 సిలిండర్లు మాత్రమే ఇస్తారు. మరి ఇలాంటి హౌటల్ నిర్వాహకులకు విచ్చలవిడిగా అడిగినన్ని సిలిండర్లు ఎవరు ఇస్తున్నారు? ఎలా వస్తున్నాయని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ వస్తుందా?, ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజలు, టిఫిన్ సెంటర్ల వద్ద టీ సెంటర్ ల వద్ద ఎక్కువసేపు నిలబడాలంటే భయపడు తున్నారు.బస్టాండ్లోనే ప్రయాణికులు నిల్చున్న ప్రదేశాలలో టీ బండ్లు ఎక్కువగా ఉన్నాయి. వెంటనే అధికారులు, గ్యాస్ డీలర్లు చర్యలు తీసుకుని డొమెస్టిక్ సిలిండర్లను, టిఫిన్ సెంటర్లలో వాడ కుండా చూడాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్ర త్తలు తీసుకో వాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభు త్వానికి ఆదాయం రాకుండా కమర్షియల్ సిలిండర్లు వాడకుండా, చిన్న సిలిండర్లు వాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి
ఇండ్లలో వాడుకునే వంట గ్యాస్ చిన్న సిలిండర్లు రహమత్ నగర్ బస్టాండ్ సెంటర్లో గల టిఫిన్ సెంటర్లలో, టీ, సెంటర్లలో వాడుతున్నారు. ఒక్కొక్క హౌటల్లో ఐదు నుంచి ఏడు వరకు బహిరంగంగానే కనపడు తున్నాయి. ఈ విధంగా వాళ్ల ఇండ్లలో ఎన్ని సిలిం డర్లు నిల్వ ఉంచారో తెలియదు. కమర్షియల్ సిలిం డర్లు వాడకుండా ప్రభుత్వానికి నష్టం కలిగి స్తున్న వ్యాపారస్తులపై చర్యలు చిన్న సిలిండర్లు టిఫిన్ సెంటర్లలో వాడితే పేలిపోయే ప్రమాదం ఉంది. వెంటనే అధికారులు, గ్యాస్ డీలర్లు, డొమెస్టిక్ సిలిండర్లు టిఫిన్ సెంటర్లలో వాడే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- వరప్రసాద్, రహమత్ నగర్ నివాసి