Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.వి.ప్రసాద్
నవతెలంగాణ-బంజరాహిల్స్
మోడీ తిరోగమన విధానాలు దేశాన్ని వినాశనం వైపు నేడుతున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.వి.ప్రసాద్ అన్నారు. హైదరాబాద్, పంజాగుట్ట, ఏ.ఐ.ఎఫ్.బి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏ.ఐ.ఎఫ్.బి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. రాములు యాదవ్, హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి వెంకటేష్ యాదవ్, హైదరాబాద్ జిల్లా నాయకులూ ఆవుల శ్రీకాంత్ యాదవ్, సయ్యిద్ తౌఫిక్ అలీ, అజమత్ ఖాన్ లతో కలసి ఆర్.వి.ప్రసాద్ మాట్లాడారు. నిత్యావసర వస్తువులు, పెట్రో ల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కేవలం తన కార్పొరేట్ మిత్రులు అదానీ, అంబానీ లకోసమే పాలనా కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు అనేక బాధలు పడుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరంగా మారుతున్నాయని, ధరల పెరుగుదల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పధాని మోడీ మౌనం విడి తక్షణమే పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపో తున్నాయని అయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్పొరేట్ కాలేజీ యాజ మాన్యాలపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అయన విజ్ఞప్తి చేశారు. కాకతీయ మెడికల్ కళాశాల యాజమాన్యం ర్యాగింగ్ ముప్పును అరిక ట్టడంలో పూర్తిగా విఫలమైందని అయన విమర్శించారు.